రామాయణం సినిమాపై సన్నీ డియోల్ ప్రశంసలు: ప్రతి ఒక్కరూ చూడాలని పిలుపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
రామాయణం సినిమాను ప్రతి ఒక్కరూ తప్పకుండా వీక్షించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పిలుపునిచ్చారు. ఈ చిత్రం హాలీవుడ్ సినిమాల కంటే మెరుగ్గా ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, రెండో భాగంలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు.