ఆమనగల్లు గడ్డపై శోభాయమానంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు శివలింగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.