పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక అవగాహన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైక్రోబయాలజీ అధ్యాపకుడు కిరణ్ జక్కాల ఆధ్వర్యంలో స్థానిక హోల్సమ్ మష్రూమ్ కేంద్రాన్ని విద్యార్థులు సందర్శించారు. సాగు విధానాలు, విత్తనాల ఎంపిక, సబ్‌స్ట్రేట్ తయారీ, తేమ నియంత్రణ మరియు తెగుళ్ల నివారణపై అవగాహన పొందారు. భవిష్యత్తులో వ్యవసాయ స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి ఈ అధ్యయన పర్యటన ఎంతో దోహదపడుతుందని అధ్యాపకులు స్పష్టం చేశారు.