నెల్లూరు జిల్లాలో అటకెక్కిన సీసీ కెమెరాల నిఘా

రిపోర్టర్: శివ స్థలం: నెల్లూరు

పోలీస్ శాఖ నిర్లక్ష్యంతో నెల్లూరు జిల్లాలో సీసీ కెమెరాల నిఘా కొరవడిందని వివిధ వర్గాలు వెల్లడించాయి. వేదాయపాలెం, కావలి, గూడూరు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు చాలా వరకు పనిచేయకపోవడంతో దొంగతనాలు పెరిగిపోతున్నాయని అధికారులు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం లేకపోవడం, మరమ్మతులకు నోచుకోకపోవడంతో నేరాల పరిశోధన మందగించిందని, తక్షణమే స్పందించి కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.