'అర్హత లేకున్నా వైద్యం చేస్తే ఖబడ్దార్!': సూరత్‌లో నకిలీ వైద్యుల అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: సూరత్
గుజరాత్‌లోని సూరత్ నగరంలో సరైన వైద్య అర్హతలు లేకుండా డాక్టర్లుగా చెలామణి అవుతూ రోగులకు చికిత్స అందిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పాండేసరా ప్రాంతంలోని ఎనిమిది వేర్వేరు క్లినిక్స్‌పై ఎస్‌వోజీ పోలీసులు రైడ్స్ నిర్వహించి, కేవలం 12వ తరగతి మాత్రమే చదివి వైద్యులుగా నటిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు లక్ష రూపాయల విలువైన మందులు, ఇంజెక్షన్లు, వైద్య సామాగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.