మైదానంలో తెలుగు కబుర్లు: తిలక్, నితీశ్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తెలుగులో సంభాషించుకోవడం విశేషమని క్రీడా విశ్లేషకులు తెలిపారు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను గెలిపించారు. మైదానంలో వారు మాట్లాడుకున్న మాటలు స్టంప్ మైక్లో రికార్డయ్యాయని, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.