విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయవాడ
విజయవాడకు చెందిన సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఆచూకీ లేకుండా మాయం కావడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశిస్తూ, సెప్టెంబర్ 30వ తేదీలోగా సీల్డ్ కవర్లో దర్యాప్తు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.