షివ శర్మ మృతి కేసు: పరారీలో ఉన్న శ్రద్ధా దూబే నేపాల్ పరుగు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Lucknow

లక్నోలో సంచలనం సృష్టించిన శివ శర్మ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితురాలైన శ్రద్ధా దూబే నేపాల్కు పారిపోయినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె సోదరి రష్మి దూబే, మరో వ్యక్తి ఆదిల్ కూడా ఉన్నట్లు సీసీటీవీ టేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని రూపాయిడిహా వద్ద ఆమె కారు లభ్యం కాగా, నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.