గుర్గావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు కార్మికులు మృతి

రిపోర్టర్: గోపి స్థలం: Gurgaon

హర్యానా రాష్ట్రం గుర్గావ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పనులను నిర్వహిస్తున్న నలుగురు కార్మికులను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాలంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన బిజేంద్ర (60), పప్పు సింగ్ (58) అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు సతీశ్ చంద్, రామ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ వైపు నుంచి వస్తున్న ఈ కారును ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఇరవయ్యేళ్ల విద్యార్థి వేదన్ ఖన్నా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఖన్నాను ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. బజ్ఘేరా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.