గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: ఖమ్మం సీపీ సునీల్‌దత్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సునీల్‌దత్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, నైతిక విలువల మార్గాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.