చేబ్రోలులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

రిపోర్టర్: సునీల్ స్థలం: గుంటూరు

చేబ్రోలు మండలం శేకూరులో పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షల రూపాయల విబీజీ-రామ్-జీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు మరియు ఒక కోటీ తొమ్మిది లక్షల రూపాయల జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టనున్న మౌలిక వసతుల పనులకు గ్రామ పెద్దలు, పార్టీ నాయకులతో కలసి శంకుస్థాపన చేసినట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని ఆయన తెలిపారు.