భక్తిపారవశ్యంతో పులకించిన పాల్వాయి వినాయక మండపాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుర్రంపోడు
గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో జెడ్పీ హైస్కూల్ గల్లీ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నాలుగో రోజు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. పురోహితులు నిమ్మగడ్డ సత్యనారాయణ మంత్రోచ్ఛారణల నడుమ వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బూడిగా ఆంజనేయులు స్వాతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల మధ్య సాగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.