జన్నారంలో ఈనెల 28న అటవీ కలప బహిరంగ వేలంపాట

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అటవీ డివిజన్ కార్యాలయం జిడిసిలో ఈనెల 28న కలప వేలం నిర్వహించనున్నట్లు ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. ఉదయం పది గంటలకు వేలంపాట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గృహ అవసరాలు ఇతర పనుల కోసం కలప కావలసినవారు వేలంలో పాల్గొని కొనుగోలు చేయాలని సూచించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.