దేశంలో మరోసారి భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నట్లు సెంట్రమ్ బ్రోకింగ్ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్లో బస్తా సగటు ధర రూ.7 పెరుగగా, అక్టోబర్లో మరో రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొన్నది. పెరిగిన ఇంధన ఖర్చులు కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయని, దక్షిణ భారతదేశంలో ధరలు అత్యధికంగా రూ.11 పెరిగినట్లు సెంట్రమ్ తెలిపింది. త్రైమాసికం చివర్లో నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.