జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణ విద్యార్థిని పతకాల పంట

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

హర్యానా రాష్ట్రం పానిపట్లో జరిగిన సీబీఎస్ఈ జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణ విద్యార్థిని తాటిపెల్లి అశ్వజ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఉప్పల్లోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదకొండో తరగతి చదువుతున్న అశ్వజ రజత, కాంస్య పతకాలు సాధించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. కేవలం పదహారు నెలల వ్యవధిలోనే ఆర్చరీలో జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో పాటు, మహారాష్ట్రలో జరగనున్న ఎస్జీఎఫ్ఐ జాతీయ ఆర్చరీ టోర్నమెంట్కు నేరుగా ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.