మంద్‌సౌర్‌లో చాక్లెట్ కోసం దారుణం: నీటి ట్యాంకులో పడేసి బాలుడి హత్య
రిపోర్టర్: అశోక్
స్థలం: మంద్సౌర్
మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ జిల్లాలో చాక్లెట్ కోసం జరిగిన చిన్నపాటి వివాదం ఒక అమాయక బాలుడి ప్రాణాలను బలిగొంది. చాక్లెట్ ఇవ్వలేదనే కోపంతో నాలుగేళ్ల బాలుడు కృష్ణపాల్ను పన్నెండేళ్ల బాలిక నీటి ట్యాంకులో పడేసి హత్య చేసినట్లు శామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి కపిల్ సౌరానియా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితురాలైన బాలికను అదుపులోకి తీసుకుని జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.