వంట గ్యాస్ ఈకేవైసీ లేకుంటే అక్టోబర్ ఒకటి నుంచి సిలిండర్ల నిలిపివేత

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని నెల్లూరు జిల్లా పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేశారు. ఈనెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాయితీ సిలిండర్ల పంపిణీ నిలిపివేస్తామని హెచ్చరించారు. నకిలీ కనెక్షన్ల తొలగింపునకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానం అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఎనభై తొమ్మిది శాతం మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేశారని, మిగిలిన వారు తక్షణమే మొబైల్ యాప్ల ద్వారా లేదా గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.