తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలుగు రాష్ట్రాలు
వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.