కాకినాడలో అశ్లీల వీడియోల కలకలం: గిరిధర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
రిపోర్టర్: విజయ్
స్థలం: కాకినాడ
కాకినాడ సాంబమూర్తినగర్‌లో గండి గిరిధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అశ్లీల వీడియోలు ఇవ్వడానికి నిరాకరించడంతోనే అతన్ని హత్య చేసినట్లు నిందితులు పాలేపు వివేక్, ఏలూరి రామకృష్ణ అంగీకరించారు. నిందితుల నుంచి నాలుగు ఫోన్లు, కత్తి, పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళల ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలనే ప్లాన్‌తోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది.