విజయనగరం జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: మహిళలకే కీలక పదతులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
ప్రభుత్వం మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు మరియు వార్డు సభ్యుల రిజర్వేషన్లను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విజయనగరం కార్పొరేషన్తో సహా అన్ని మున్సిపాల్టీల్లో నెల్లిమర్ల మినహా ఛైర్మన్ పదవులను మహిళలకే కేటాయించారు. జిల్లాలో రాజాం మినహా అన్ని చోట్ల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించగా ఆశావహులు టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.