రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడితో రగిలిపోయిన ప్రజాసంఘాలు

రిపోర్టర్: AMPAIAH ACHARI స్థలం: ఎమ్మిగనూరు

రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడిని విద్యార్థి మరియు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిందితుడు హేమంత్ను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర డిమాండ్ చేశారు. మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ బాలికలకు రక్షణ కరువైందని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రత కల్పించాలని నేతలు స్పష్టం చేశారు.