ఇరాన్‌తో ఒప్పందమా లేక దాడులా: తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్న డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: విజయ్
స్థలం: Washington
ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలా లేక దాడులను తిరిగి ప్రారంభించాలా అనేదానిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు స్థావరాలు పూర్తిగా తమ నిఘా నీడలోనే ఉన్నాయని, ఎలాంటి కదలికలనైనా సమర్థంగా తిప్పికొడతామని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిని తమ అజమాయిషీలోనే ఉంచుకున్నామని ఆయన పునరుద్ఘాటించారు.