మేక్ ఇన్ ఇండియా పథకానికి పన్నెండేళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో తయారీ రంగం, ఎగుమతులు, డిజిటల్ వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా పథకం పన్నెండేళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకుందని పీఐబీ ఇండియా వెల్లడించింది. పీఎల్ఐ పథకాల ద్వారా రూ.23.8 లక్షల కోట్ల ఉత్పత్తితో పాటు భారీగా పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. నూతన ఆవిష్కరణలు, ఎంటర్ప్రైజ్లతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.