అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ల వైపు ఇండియన్ అమెరికన్ల భారీ మొగ్గు
రిపోర్టర్: సునీల్
స్థలం: World
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీ వైపు భారీగా మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వే తేల్చింది. కాంగ్రెషనల్ ఎన్నికల్లో 66 శాతం మంది డెమోక్రాట్లకు మద్దతు తెలపగా, రిపబ్లికన్లకు కేవలం 18 శాతమే మద్దతు లభించింది. నవంబర్ 3న జరగనున్న ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది. 90 శాతానికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు.