గుండాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన విప్ బీర్ల ఐలయ్య

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

గుండాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.