నాకు ఇష్టమైన కెప్టెన్లు వారే అంటూ సచిన్ టెండూల్కర్ వెల్లడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ఎం.ఎస్ ధోనీ తనకు ఇష్టమైన కెప్టెన్లు అని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన కెరీర్ లో ఎంతో మందితో ఆడానని, నాటితో పోలిస్తే నేడు బీసీసీఐ పనితీరు చాలా మారిందని సచిన్ పేర్కొన్నారు. టెంబా బవుమా కెప్టెన్సీని కూడా ఆయన ప్రశంసించారు.