సిరివెల్లలో వైఎస్సార్సీపీకి భారీ షాక్: తెలుగుదేశం పార్టీలోకి నలుగురు వలస
రిపోర్టర్: సురేష్
స్థలం: నంద్యాల
సిరివెల్ల మండలం, సిరివెల్ల గ్రామానికి చెందిన సుమారు నలభై మంది వైఎస్సార్సీపీని వీడి టీడీపీ విధానాలపై నమ్మకంతో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి వెల్లడించారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.