పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కొత్తగూడెం

కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వివాహేతర సంబంధం వ్యవహారం రచ్చకెక్కింది. స్టేషన్లోనే ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిబ్బంది తక్కువగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనపై నైట్ డ్యూటీ కానిస్టేబుళ్లు అప్రమత్తమై వారిని చెదరగొట్టారు. ఘర్షణకు పాల్పడిన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.