మక్కా వైపు దూసుకొచ్చిన హౌతీ డ్రోన్‌ను కూల్చేసిన సౌదీ అరేబియా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

మక్కా వైపు దూసుకొచ్చిన హౌతీ ఉగ్రవాదుల డ్రోన్‌ను సౌదీ అరేబియా గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. అయితే తాము మక్కాను లక్ష్యంగా చేసుకోలేదని, ఇది కేవలం అబద్ధపు ప్రచారమని హౌతీ నేత హజెమ్ అల్-అస్సాద్ తోసిపుచ్చారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా తన పౌరులకు సౌదీ అరేబియా ప్రయాణాలపై కీలక హెచ్చరికలు జారీ చేసింది.