నటి దియా మీర్జా వీడియో తొలగింపుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: ముంబై

నటి దియా మీర్జా దీపావళిపై చేసిన అవగాహన వీడియోను తొలగించడం పట్ల బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు న్యాయవర్గాలు తెలిపాయి. భారత్ లౌకిక దేశమని, పర్యావరణ అంశాలకు మతం ఆపాదించడం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. తొలగించిన వీడియోను వెంటనే తిరిగి అప్లోడ్ చేయాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను న్యాయస్థానం ఆదేశించింది.