'ఒక్క గజం అదనంగా ఉన్నా ప్రభుత్వానికే రాసిస్తా': సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబంపై చేసిన భూ ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో చూపిన ఆస్తుల కంటే ఒక్క గజం భూమి అదనంగా ఉన్నట్లు నిరూపించినా మొత్తం ఆస్తిని ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ విసిరారు. శాసనసభ వేదికగా సీఎం నిరాధార ఆరోపణలు చేశారని, దీనిపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కవితతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించిన వివిధ ప్రముఖుల ఆస్తులపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె పట్టుబట్టారు.