కొండాపూర్ వసంత్ సిటీలో ఘనంగా గణపతి అన్నమయ్య కీర్తనల ఆలపన

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

కొండాపూర్ లోని హాఫీజ్ నగర్ వసంత్ సిటీలో గణపతి పండుగ మూడవ రోజు సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని శిష్య బృందం గణపతి మరియు అన్నమయ్య కీర్తనలను భక్తిశ్రద్ధలతో ఆలపించారు. శ్రీ రమణ గోరంట్ల సారథ్యంలో సాందీప్, శ్రేయ, సాయి గాయత్రి, తేజస్విని, రన్విత రెడ్డి, అక్షయ, అక్షయ్ తదితరులు వివిధ ప్రసిద్ధ కీర్తనలతో భక్తులను అలరించగా, తబలాపై సిద్ధు, కీబోర్డుపై మనోహర్ వాయిద్య సహకారం అందించారు.