ఏలూరు పోలీసులకు ప్రత్యేకంగా 'సాధన' శిక్షణ కార్యక్రమం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లాలో పోలీసు సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఎస్పీ కేపీఎస్‌ కిశోర్ వినూత్నంగా 'సాధన' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శుక్రవారం డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ఘటనా స్థలంలో సాక్ష్యాల సేకరణ, సీపీఆర్‌ చేయడం, నేరస్థుల పట్టుబడి వంటి అంశాలపై నిపుణుల ద్వారా అవగాహన కల్పిస్తూ విధుల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు.