'నెల్లూరులో ఘన స్వాగతం..': మంత్రి నారా లోకేశ్ పర్యటనలో ఉత్సాహం

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన సందడిగా సాగింది. నగరంతో పాటు కోవూరులోనూ శ్రేణుల ర్యాలీలు, గజమాలలతో ఘన స్వాగతం లభించింది. మెడికవర్ ఆసుపత్రి కూడలి నుంచి బైక్ ర్యాలీ చేపట్టి, ఆర్‌ఎస్‌ఆర్‌ హైస్కూల్, డీఎస్‌ఆర్‌ బాలికోన్నత పాఠశాలలను మంత్రులు నారాయణ, ఫరూఖ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న లోకేశ్, కోవూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యకర్తలతో సమావేశమయ్యారు.