పుణెలో షాకింగ్ ఘటన: ఉద్యోగం మానేస్తున్న వేళ డేటా సైంటిస్టుకు మేనేజర్ చుక్కలు

రిపోర్టర్: గోపి స్థలం: Pune

కంపెనీని విడిచిపెట్టే చివరి పదిహేను రోజుల్లో మేనేజర్ తన పనితీరుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నరకం చూపిస్తున్నాడని పుణెకు చెందిన ఓ డేటా సైంటిస్టు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. రిటెన్షన్ ఆఫర్ను తిరస్కరించినందుకే కక్షగట్టి వేధిస్తున్నారని పేర్కొంటూ ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.