ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగాఖాన్-వీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌కు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆయనను ఆహ్వానించారు. ఉస్మానియా ఆస్పత్రి, సిటీ కాలేజ్ భవనాల పునరుద్ధరణతో పాటు మూసీ నది పునరుజ్జీవం కోసం అగాఖాన్ ఫౌండేషన్ సహకారం అందించాలని సీఎం కోరారు.