ఎల్లంబావి గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన వనజ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి గ్రామ సర్పంచ్ గంజి వనజ కృష్ణ గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగతో ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.