ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిరంతరాయంగా ఇసుక అందిస్తామన్న కలెక్టర్ కుమార్ దీపక్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తహసిల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆయన అధికారులతో సమీక్షించారు. అటవీ ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ అనవసర ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.