రష్యాలో భారీ అజ్ఞాత భూగర్భ డ్రోన్ తయారీ కేంద్రం నిర్మాణం

రిపోర్టర్: రాజేష్ స్థలం: రష్యా

రష్యాలోని తాతార్‌స్థాన్ ప్రాంతంలోని అళాబుగా స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో షాహెద్ తరహా డ్రోన్ల తయారీని విస్తరిస్తున్నట్లు కొత్త ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఉక్రెయిన్ దాడుల నుంచి రక్షణ పొందేందుకు రష్యా ప్రభుత్వం ఈ భారీ భూగర్భ సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు ఓసింట్ విశ్లేషకులు తెలిపారు. గెరాన్-2 రకం దాడి డ్రోన్ల తయారీ నెట్‌వర్క్‌ను దాడుల నుంచి సురక్షితంగా ఉంచేందుకు మాస్కో ఈ చర్యలు చేపట్టింది.