మహిళల క్రికెట్ ప్రపంచకప్ విజయం: చరిత్ర సృష్టించి నేటికి ఏడాది పూర్తి

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబయి

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి నేటికి ఏడాది పూర్తయిందని బీసీసీఐ వెల్లడించింది. నవీ ముంబయి వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసి హర్మన్ ప్రీత్ కౌర్ సేన వరల్డ్ కప్ ముద్దాడిన అపురూప క్షణాలు ఎప్పటికీ మరువలేమని పేర్కొంది. ఈ చారిత్రక విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపింది.