దస్తురాబాద్ మండలంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దస్తురాబాద్
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని అకొండపేట గ్రామంలో సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ ప్రపంచానికి చాటిచెప్పారని, ఆయన ఆశయాలు నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని సంఘమిత్ర యూత్ సభ్యులు పేర్కొన్నారు.