తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, పద్మ విభూషణ్ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రజాకార్ల నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన గొప్ప నాయకుడని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గొంతుకగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా త్యాగంచేసిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.