విశాఖలో భారీగా గంజాయి, హాష్ ఆయిల్ పట్టివేత: పోలీసుల దాడులు

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖ నగరంలో గోపాలపట్నం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో ఒక కిలో హాష్ ఆయిల్ మరియు పది తొమ్మిది కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ నగర పోలీసుల అధికారిక ఖాతా ద్వారా వెల్లడించారు. సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నిత్య తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ ఘటనలో ఒక నిందితురాలిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం గోపాలపట్నం పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు.