మైసిగండి మైసమ్మ ఆలయంలో సాలార్పూర్ గ్రామస్తుల ప్రత్యేక పూజలు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం సాలార్పూర్ గ్రామ ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని సర్పంచ్ ప్రియా రమేష్ నాయక్ ఆధ్వర్యంలో మైసిగండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పరిధిలోని సుమారు 1200 ఎకరాల ఇరవై రెండు సీ రెవెన్యూ సమస్య తొలగిపోవడంతో గ్రామస్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భూ సమస్య పరిష్కారానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో పాటు పలువురు ప్రముఖులకు గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.