'ఆధారాలు చూపాలి.. లేదంటే లీగల్ యాక్షన్!': చంద్రశేఖర్
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తనపై వస్తున్న నిరాధార ఆరోపణలను టీడీపీ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఇసుక, గరుసు విక్రయాలు, బెల్ట్ షాపులు, ఆసుపత్రి వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే తక్షణమే బహిర్గతం చేయాలని, లేకపోతే పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుట్టినరోజు వేడుకలను గ్రూపు రాజకీయాలుగా చిత్రీకరించడం తగదని, రాజకీయ విమర్శలు ప్రజా సమస్యలు, అభివృద్ధిపైనే ఉండాలని హితవు పలికారు.