స్వతంత్ర అభ్యర్థుల గుర్తులపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం: బకెట్, పెన్ స్టాండ్ రద్దు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జనసేన పార్టీ అధికారిక గుర్తు గాజు గ్లాస్‌ను పోలి ఉన్నాయన్న అభ్యంతరాల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితా నుంచి బకెట్, పెన్ స్టాండ్లను తాత్కాలికంగా నిషేధించినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల గందరగోళాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.