విజయవాడలో వందల కోట్ల దేవాదాయ భూములు అన్యాక్రాంతం

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో దుర్గగుడి సహా పలు ప్రముఖ ఆలయాల వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయి. దేవాదాయ శాఖ 43/10 రిజిస్టర్‌లో స్పష్టంగా ఉన్నప్పటికీ, అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా అన్యాక్రాంతమవుతున్నాయి. గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో ఆలయాలు, మఠాలకు చెందిన వేల కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పాలువుతున్నా రెవెన్యూ, దేవాదాయ యంత్రాంగం నిరోధించడంలో విఫలమైంది.