నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఫీల్డ్ అసిస్టెంట్ హాల్ టికెట్లు విడుదల
రిపోర్టర్: మహేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి ప్రవేశ పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. నవంబర్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.