రోడ్డు విస్తరణలో జాప్యం కొండాపురం ప్రజల పాలిట శాపంగా మారిన రహదారి
రిపోర్టర్: విజయ్
స్థలం: కొండాపురం
నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపే రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలిగిరి నుంచి కొండాపురం మీదుగా వలేటివారిపాలెం వరకు విస్తరణ కోసం 2024లో 30 కోట్ల రూపాయలు కేటాయించినా, పనులు మాత్రం పూర్తి కాలేదు. గుంతలు, కంకర తేలిన రోడ్డుపై ప్రయాణించి వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. సగంలో నిలిచిన కల్వర్టుల నిర్మాణాలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.