మంత్రి గొట్టిపాటి రవికుమార్కు సవాల్: అద్దంకిలో వైకాపా నేత ప్రతిపాదన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: బల్లికురవ

రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ వినూత్న సవాల్ విసిరారు. ఎన్నికల ఖర్చును తగ్గించి, ఆ నిధులతో నియోజకవర్గ ప్రజల కోసం ఉమ్మడిగా వంద పడకల ఆసుపత్రిని నిర్మిద్దామని ఆయన ప్రతిపాదించారు. ఎన్నికల ఖర్చు కంటే ఆసుపత్రి నిర్మాణం వేల కుటుంబాలకు తరతరాల పాటు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.